Friday, 13 November 2026

వార్తలు

కలెక్టర్‌ను అడ్డుకున్న పోలీసులు

ఆదిలాబాద్‌: జిల్లాలోని జోడేఘట్‌లో ఇవాళ జరుగుతున్న కొమురంభీం 72వ వర్థంతికి నివాళుర్పించడానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ను హట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కారణాల వల్లనే కలెక్టర్‌ను అడ్డుకున్నామని పోలీసులు తెలుపుతున్నారు. జోడేఘట్‌కు కలెక్టర్‌ రావల్సిందేనని ఆదివాసీలు కలెక్టర్‌ను…

రైతులకు వడ్డీలేని రుణాలు: సీఎం

మెదక్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో మూడు రోజుల ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని సీఎం ఈ ఉదయం ప్రారంభించారు.. దుబ్బాకలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యారు.…

వైకాపాలో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌కుమార్‌ వైకాపాలో చేరారు. లోటన్‌పాండ్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సూరంపల్లిలో ఐకేసీ సభ్యుల అందోళన

దౌల్తాబాద్‌ గ్రామీణం : మెదక్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట సంధర్బంగా సూరంపల్లిలోనిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమానికి ఐకేసీ సభ్యులను అనుమతించలేదు దీంతో మహిళలు రోడ్డుపై భైఠాయించి అందోళనకు దిగారు. కేవలం 300 మందికి మాత్రమే పాసుల ఇచ్చి…

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగర మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,150గా ఉంది. కిలో వెండి ధర రూ. 59,650గా పలుకుతోంది.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రికార్డుస్థాయిలో పత్తి

ఖమ్మం : జిల్లాలో పత్తి కోనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకాల కోసం రైతులు భారీగా పత్తినితీసుకువచ్చారు. రికార్డు స్తాయిలో 70 వేల పత్తి బస్తాలను అమ్మకానికి తీసుకువచ్చారు.

బాధ్యతలు చేపట్టిన పలువురు మంత్రులు

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో శాఖలు మారిన పలువురు మంత్రులు, కొత్త మంత్రులు న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా జ్యోతిరాదిత్య సింధియా. విద్యుత్‌ శాఖ నుంచి పెట్రోలియం శాఖకు మారిని…

ఇండోనేషియాలో స్వల్ప భూకంపం

జకార్త: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలు దీని తీవ్రత 5.3గా నమోదైంది. నియాన్‌ నగరానికి ఆగ్రేయంగా 105 కి. మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

అప్రమత్తమైన అమెరికా యంత్రాంగం

వాషింగ్టన్‌: భీకర్‌ తుపాను ‘ సాండీ ‘ అమెరికాను వణికిస్తోంది. ఈ రోజు రాత్రికి  న్యూయార్క్‌, న్యూజెర్సీ ప్రాంతాల్లో తుపాను తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూయార్క్‌ నగరంలోని తీర ప్రాంతల నుంచి…

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు: జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన్నాన్ని పట్టుకున్నారు. రేణిగుంట వద్ద వాహంనంలో అక్రమంగా  తరలిస్తున్న రూ. 80 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో గుడిపాల…