Friday, 13 November 2026

వార్తలు

నిమ్మగడ్డను కలిసిన సీనీనటుడు నాగార్జున

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కుసులో చంచల్‌గూడ జైలులో ఉన్న పారిశ్రమికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సినీనటుడు నాగార్జున కలిశారు. ఈ రోజు నిమ్మగడ్డ ప్రసాద్‌ జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు నాగార్జున తెలిపారు.

పాదయాత్రపై సుదీర్ఘ చర్చలు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కుసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య భారతి కలసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రపై నిర్ణయం తీసుకునే విషయంలో జగన్‌తో చర్చించినట్లు తెలిసింది.…

నీరు విడుదల చేయండి

ఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీజలాల అధారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో 15 రోజుల్లోగా 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది.

గాలి బెయిల్‌ వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్ధానంలో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

షిండే వ్యాఖ్యలపై పాల్వాయి అసంతృప్తి

  హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత పాల్వయి గోవర్దన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో అధిష్టానం పెద్దలు చర్చలు జరిపారని అన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌తో కేసీఆర్‌ చర్చలు సంతృప్తి కరంగా జరిగాయన్నారు.…

అంతరించి పోతున్న జాతుల పరిరక్షణకు చర్యలు:ఫారుఖీ

హైదరాబాద్‌: దేశంలో జీవ వైవిద్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లను ఖర్చు చేసిందని, దీనిని ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించి పని చేస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఎం.పారుఖీ వెల్లడించారు.

ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు:ముఖ్యమంత్రి

ఒంగోలు: రాజీవ్‌ యువకిరణాల కింద ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

మునీత అత్మహత్య

  గుంటూరు : జిల్లా విద్యాసాగర్‌లోని ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహం పైనుంచి కిందికి దూకి ఇంటర్‌ చదువుతున్న ఒక విద్యార్థిని అత్యహత్య చేసుకుంది. కళాశాల నిర్వాహకులు విద్యార్థిని అత్మహత్య విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. చదువులో రాణించలేదని మనస్తాపంతో…

మహంకాలి ఆలయానికి పటిష్ట బందోబస్తు

హైదరాబాద్‌: పాతబస్తీలో మహంకాళి దేవాలయానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని మంత్రి గీతారెడ్డి హామీ ఇచ్చారు. దేవాలయం చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయంలో చోరీ చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామనాని హామి ఇవ్వటంతో ఆలయ ఉమ్మడి…

పేద విద్యార్తుల చదువుకోసం ప్రభుత్వం రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తుంది: కిరణ్‌

  సంతనూతలపాడు: పేదవిద్యార్థులకోసం చదువు కోసం 25వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మబాట పర్యటనలో భాగంగా సంతనూతలపాడులో ఏర్పాటుచేసిన బహిరంగాసభలో సీఎం ప్రసంగించారు. సంపాదించిన డబ్బు కోల్పోవచ్చుగాని చదువు ఎక్కడికి…