Friday, 13 November 2026

వార్తలు

ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన వంశధార ట్రైబ్యునల్‌

ఢిల్లీ: ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలను వంశధార ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. వంశధార ట్రైబ్యునల్‌ లో సభ్యుడిగా జస్టిస్‌ గులాం అహ్మద్‌ నియామకాన్ని ఒడిశా సవాలుచేసింది. సభ్యుల నియామకం, తొలగింపు అధికారం తమకు లేదని ట్రైబ్యునల్‌ చైర్మన్‌ ఒడిశా ప్రభుత్వానికి స్పష్టంచేశారు.…

రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం

తిరుమల: తరచుగా సెలవులు రావడంతో భక్తుల రద్దీతో పాటు తిరుమలలో వెంకన్న స్వామి ఆదాయమా పెరిగింది. నిన్న రికార్డు స్థాయిలో రూ.3.45 కోట్లు స్వామి వారిని భక్తుల కానుకల రూపంలో లభించిందని అధికారులు తెలియజేశారు.

దొంగనోట్ల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని కూకెట్‌పల్లి ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరగురు సభ్యులు ఈ ముఠా దగ్గర్నుంచీ రూ. 2 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

సచివాలయ ముట్టడికి తెదేపా కార్పొరేటర్ల యత్నం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఈ రోజు సచివాలయ ముట్టడికి యత్నించారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తూ తెదేపా కార్పొరేటర్లు సచివాలయ ముట్టడికి యత్నించారు.

కేంద్రమంత్రి జైశ్వాల్‌పై కేసు నమోదు

కాన్పూరు: కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకావ్‌ జైశ్వాల్‌పై కాన్పూరు జిల్లా కోర్టులో కేసు నమోదు అయ్యింది. మహిళల పట్ల జైశ్వాల్‌ అనుచిత వ్యాఖ్యాలకు చేశారంటూ అనితా దువా అనే మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే మంత్రి…

జెయింట్‌ వీల్‌ నుంచి పడి ఎయిర్‌హోస్టెన్‌ మృతి

చైన్నై: జెయింట్‌ వీల్‌ నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చైన్నైలో చోటుచేసుకుంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఎయిర్‌హోస్టేన్‌గా పనిచేస్తున్న ఆఫిమాక్‌ అనే మహిళ నగర శివారులోని ఈవీపీ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లోని భారీ జాయింట్‌ వీల్‌…

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని మార్కెట్‌లో బంగారం ధర ఈ విధంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,500గా ఉంది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,080 గా ఉంది. కిలో వెండి…

పాఠశాలల్లో మౌలిక వసతులపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పాఠశాలల్లో 6 నెలలలోపు మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పించాలని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ వ్యవహారంపై మూడోసారి సుప్రీం కోర్టు తీర్పు…

నేటి నుంచి 50 వేల మంది భూమిలేని నిరుపేదల పాదయాత్ర

న్యూఢిల్లీ: దేశంలో భూమిలేని నిరుపేదల ‘ జన సత్యాగ్రహం’ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా 26 రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది ప్రజలు ఎన్టీవో ఏక్తా పరిషత్‌ ఆధ్వర్యంలో గ్వాలియర్‌ నుంచి ఢిల్లీ వరకు…

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు-51,900 క్యూసెక్కుల నీటి విడుదల

విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ నుంచి 51,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.