Friday, 13 November 2026

వార్తలు

కొళ్లకుంటలో రెండో రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీ కోసం ‘ పాదయాత్ర రెండో రోజు ప్రారంభమైంది. జిల్లాలోని కొళ్లకుంటలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరాగ చంద్రబాబు పాదయాత్రగా బయలుదేరారు.  నేడు 18 కిలోమీటర్ల…

బాపూజీకి ఘన నివాళి

అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద సీఎం కిరణ్‌, స్పీకర్‌ నాదెండ్ల, మండలి చైర్మన్‌ చక్రపాణి, బాపూ ఘాట్‌ దగ్గర కోదండరాం జాతిపిత మహాత్ముడికి యావత్‌ భారతం ఘనంగా నివాళులర్పించింది. ఆయన భారత జాతికి చేసిన సేవలను స్మరించుకుంది. మహాత్ముడి…

చిట్టవరంలో భారీ వర్షానికి ఇల్లుకూలి వృద్దురాలు మృతి

పశ్చిమగోదావరి: నర్సాపురం మండంలంలోని చిట్టవరంలో 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో కర్రా సుబ్బయమ్మ(60) అనే వృద్దురాలు మృతి చెందినది. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పమయంలో ఈ ఘటన జరిగింది.…

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరగాల్సిన టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలపై ఆయెమయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేటినుంచి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరగాల్సిన టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలపై ఆయోమయం నుకొంది. తనిఖీలు ఆపాలని ప్రభుత్వంపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. తనిఖీలు నిలిపివేయాలని సాంకేతిక విద్యాశాఖకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు సమాచారం

కూలిన పురాతన భవనం

చెన్నై: నగరంలో సుంగవర్‌ వీధిలో ఈ ఉదయం ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 4గురు శిధిలాలకింద చిక్కుకున్నారు. 2అంతప్తుల ఈ భవనంలో ఓ ప్రింటింగ్‌ప్రేస్‌ కూడా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. అధికార సిబ్బంది…

శంశాబాద్‌ విమానాశ్రయంలో 900గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంశాబాద్‌ విమానాశ్రమంలో దుబాయి నుంచి వస్తున్న ఇక్బాల్‌ లనే వ్యక్తి బంగారాన్ని డీవీడీ ప్లేయర్‌లో తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకుని 900గ్రాముల బంగారం స్వాధినం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

రాజమండ్రి: అల్పపీడనంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 3రోజులుగా కురుస్తున్న వానలతో రాజమండ్రి, కాకినాడ, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటనష్ట జరిగింది.

శ్రీశైలంలో కూలిన గోపురం

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంజ సమేత మల్లిఖార్జునస్వామి వారి ఆలయ ఉత్తర గోపురమైన శివాజి గోపురం బుధవారం తెల్లవారు జామున 2.10గంటలకు సగానికి కూలిపోయింది. వర్షాలవలన కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గోపురాన్ని ఇదివరకు పరిశీలించిన బృందం…

నైజీరియాలో 46మందిని కాల్చిచంపిన దుండగుడు

  నైజీరియా: ఉత్తర నైజీరియాలో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఉన్మాదంతో రెచ్చిపోయాడు. యూనివర్శిటికి చెందిన వసతిగృహంలో ఆ దేశ స్వతంత్య్ర దినాన 46మందిని కాల్చి చంపాడు. ముబిలోని అడమావా స్టేట్‌ యూనివర్విటిలో ఈ దారుణం జరిగింది. సైనిక…

ఇంట్లోవారిని కట్టేసి25తులాల బంగారం అపహరణ

మెదక్‌: పటాన్‌చెరు మండలంలోని రాఘవేంద్ర కాలనీలో దొంగలు బీబత్సం సృష్టించారు. కాలనీలోని ఓ ఇంట్లో నిన్న ర్నాతి ప్రవేశించి ఇంట్లోవారిని కట్టేసి 25తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.