Monday, 9 November 2026

తెలంగాణ

ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ ఏఈ

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నాగిరెడ్డిపేట పంచాయతీ రాజ్‌ ఏఈ శ్రీనివాస్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఔట్‌ సోర్సింగ్‌ టెండర్‌ను రద్దు చేయాలని ఓయూలో ఆందోళన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తక్షనమే ఔట్‌ సోర్సింగ్‌ టెంగర్‌ను రద్దు చేయాలంటూ కాంట్రాక్టు ఉద్యోగులు యూనివర్సీటీలో ఆందోళన చేపట్టారు. అనంతరం ఓయూలోని చీఫ్‌ వార్డెన్‌ కార్యాలయం నుంచి పరిపాలన భవనం వరకు ప్రదర్శనగా వెల్లారు. హాస్టల్‌ ఉద్యోగులందరిని పీఎఫ్‌,…

కేటీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

వరంగల్‌,(జనంసాక్షి): ఘన్‌పూర్‌ సమీపంలోని చెల్పూరులో ఉన్న కేటీపీలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

కిరికిరి లేకుండా తెలంగాణ బిల్లు పెట్టండి: నాగం జనార్ధన్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎలాంటి కిరికిరి లేకుండా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు…

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే : మందకృష్ణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరం తెలంగాణలో అంతర్భాగమే అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. నగరం తెలంగాణలో అంతర్భాగమేనని దాన్ని ఎవరూ కాదనలేదని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసమే సమైక్య ఉద్యమమని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.…

రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి : గంగుల కమలాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణవాదులను రెచ్చగొట్టే చర్యలు సీమాంధ్ర నేతలు మానుకోవలని టీఆర్‌ఎస్‌ నేత కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని అప్పుడు తెలంగాణ నేతలెవరూ బాధ్యులు కారని ఆయన స్పష్టం చేశారు.

ధర్మానకు మరోసారి సీబీఐ నోటీసులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. లేపాక్షి భూకేటాయింపు వ్యవహారంలో హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.

యూటీ చేస్తే అగ్నిగుండమే: మంత్రి దానం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే అగ్నిగుండమే అవుతుంది. అని మంత్రి దానం నాగేందర్‌ హెచ్చరించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. ఈ విషయమై తాను…

ఢిల్లీ చేరుకున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు సీఎం వివరించనున్నారు. ఆంటోని కమిటీతో పాటు, ఇతర పార్టీ పెద్దలను కూడా సీఎం కలవనున్నట్లు సమాచారం.

త్వరలో ఆంటోని కమిటీని కలుస్తాం : దానం నాగేందర్‌

హైదరాబాద్‌,(జనసాక్షి): హైదరాబాద్‌ అంశంపై త్వరలో ఆంటోని కమిటీని కలుస్తామని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి తాము ఒప్పుకోమని…