Monday, 9 November 2026

తెలంగాణ

నకిలీ కరెన్సీపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు: ఆర్‌బీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నకిలీ కరెన్సీ వ్యవహారంపై రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బ్యాంకింగ్‌ అంబుడ్స్‌ మెన్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. నకిలీ కరెన్సీపై సంబంధిత బ్యాంకులు స్పందించకపోతే ఆర్‌బీఐ చర్య తీసుకుంటుందని ఆర్‌బీఐ రీజినల్‌ డైరెకటర్‌ దాస్‌ స్పష్టం చేశారు.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై స్పందించిన హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఏర్పడుతున్న ఆటంకాలపై హైకోర్టు స్పందించింది. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఏ కౌన్పెలింగ్‌ కేంద్రంలోనైనా విద్యార్థులు హాజరుకావచ్చని సూచించింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియను కోర్టు కూడా పర్యవేక్షిస్తుందని హైకోర్టు తెలిపింది.

రాఖీ కట్టిన మహిళలకు ఉల్లిగడ్డలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రక్షాబంధన్‌ వేడుకలకు ఆ పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రాఖీ కట్టిన మహిళలకు ఆయన ఉల్లిగడ్డలను బహుమతిగా ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో భాతర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఈ…

ఏపీఎన్టీవోలపై హైకోర్టు సీరియస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చట్ట విరుద్దంగా సమ్మె చేస్తున్నారంటూ ఏపీఎన్టీవోపై హైకోర్టు సీరియస్‌ అయింది. రవికుమార్‌ అనే న్యాయవాది ఏపీఎన్టీవోల సమ్మె రాజ్యంగ విరుద్దమని హైకోర్టులో వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఏపీఎన్టీవోలు ప్రభుత్వ ఉద్యోగులా, ప్రైవేటు ఉద్యోగులా…

ఘనంగా శివలింగార్చన పూజలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో గోశాలలోని లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్‌దాస్‌ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను తయారు చేసి వాటిని రోజుకో ఆకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు అర్ధనారీశ్వరీ ఆకారంలో…

కోటి రూపాయల బంగారు కడ్డీ స్వాధీనం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాత బస్తీకి చెందిన రషీద్‌ అనే వ్యక్తి నుంచి రూ.కోటి విలువైన బంగారు కడ్డీని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం.

మనగుడి కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ

హైదరాబాద్‌,(జనంసాక్షి:) శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ, రాష్ట్ర దేవాదాయశాఖ చేపట్టిన మనగుడి కార్యక్రమాన్ని ఈవో ఎంజీ గోపాల్‌ తిరుపతిలో ప్రారంభించారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ కళాశాలలోని ఆలయంలో రక్షాకంకణాలకు పూజ నిర్వహించి విద్యార్థులకు కంకణాలు పంపిణీ…

సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం దిల్‌కుషా అతిథిగృహంలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ధర్మానను సీబీఐ అధికారులు విచారించనున్నారు.

మా రక్తమాంసాలతో నగరాన్ని నిర్మించాం: ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మా రక్తమాంసాలను దారపోసి హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించాం అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన మాడియాతో మాట్లాడారు. పది జిల్లాలు షరతులులేని తెలంగాణకు మాత్రమే తాము అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రుల…

ప్రారంభమైన అవనిగడ్డ బై ఎలక్షన్‌ పోలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): అవనిగడ్డ నియోజకవర్గ బై పోలింగ్‌ కొద్దిసేపటికి క్రితం ప్రారంభమైంది. మొత్తం 241 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. టీటీడీ అభ్యర్థిగా బ్రహ్మణయ్య కుమారుడు హరిప్రసాద్‌, మరో ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు9 బరిలో…