Monday, 9 November 2026

తెలంగాణ

డిప్యూటీ సీఎం ను కలిసిన టీ విద్యుత్‌ ఉద్యోగులు

హైదరాబాద్‌,(జనంసాక్షి):ం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రాంత విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు కలిశారు. విద్యుత్‌ రంగంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిజానిజాలను జేఏసీ అధ్యక్షుడు రఘు దామోదర్‌కు వివరించారు.

తెలంగాణ ఉద్యోగులపై దాడికి నిరసన వ్యక్తం చేసిన టీ జేఏసీ

వరంగల్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగులపై దాడిని  తెలంగాణ జేఏసీ జిల్లా విభగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తే ఇక్కడ తీవ్ర పరిణామాలుంటాయని జేఏసీ నేతలు హెచ్చరించారు.…

తెలంగాణ ప్రక్రియ మొదలైంది: పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌,(జనంసాక్షి:) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయనను కలిసిన తెలంగాణ ప్రాంత నేతలతో తెలంగాణ అంశంపై సమావేశమై చర్చించారు. ఈ మేరకు తెలంగాణ ప్రక్రియ మొదలైందని,…

సీఎం,డీజీపీ లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు :వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్‌ నేత జి.వివేక్‌ డిమాండ్‌ చేశారు. వీళ్లిద్దరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా ధర్నాలు చేసిన వారిపై…

19 న అంటోని కమిటీతో భేటీ కానున్న టీ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై ఏర్పాటైన ఆంటోనీ కమిటీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. ఈ నెల 19 రాత్రి ఎనిమిది గంటలకు వారు ఢిల్లీలో అంటోని కమిటీతో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన ఆవశ్యకత గురించి తెలంగాణ…

పీసీసీ చీఫ్‌ బొత్సతో తెలంగాణ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌, ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా…

బంగారు తల్లి పథకంపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో బంగారుతల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు గంటా, పితాని సత్యనారాయణ, సునీతా లక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు.

జూడాల సమ్మెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె విరమించుకుని వెంటనే విధుల్లో చేరాలని కోర్టు జూడాలకు ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవదద్దని జూనియర్‌ డాక్టర్ల తరుపున న్యాయవాదికి కోర్టు సూచించింది.

బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) నగరంలోని బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు  ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,410 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,100 గా…

అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం,  20 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.