Thursday, 5 November 2026

తెలంగాణ

భూపాల్‌పల్లిలో దొంగ అరెస్టు

వరంగల్‌; భూపాలపల్లిలో చోరీలకు పాల్పడుతున్న ఆరోపణలపై వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనుమానిత దొంగ నుంచి ల్యాప్‌టాప్‌, రెండు తులాల బంగారంతో పాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

‘కన్నెధార గనులపై సర్వే చేయించండి’

హైదరాబాద్‌; కన్యెధార లీజు వ్యవహారంలో శ్రీకాకుళం కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ ఇతర జిల్లా సిబ్బంది లోకాయుక్త ముందు హాజరయ్యారు. ఇవాళ కేసును విచారించిన కోర్టు కన్నెధారలో గ్రానైట్‌ గనులున్న భూములను సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేసు…

సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరు

హైదరాబాద్‌;జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏపీఐఐసీ అధికారులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో సంస్థ ఎండీ రామాంజనేయులు, జనరల్‌ మేనేజర్‌ మూర్తి సీబీఐ అధికారుల ముందు హాజరై విచారణకు సహకారిస్తున్నారు

హౖటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌; ఖానాపూర్‌ మండలం పసుపులలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.తెగిపడిన హైటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైóైదరాబాద్‌, బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నగర బులియన్‌ మార్యెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 27,200 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,100గా ఉంది.కిలో…

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌;టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ మేరకు ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నరసింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 24,25తేదీల్లో నామినేషన్లు ఉపసంహరణకు అవకాశమిస్తున్నామని తెలిపారు.అనంతరం…

విషపు ఇంజెక్షన్‌ తీసుకుని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఒక యువతి విషపు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు తమ్ముడితో గొడవపడి మధుప్రియ అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సౌర విద్యుత్‌ కొనుగోలు ధర ఖరారు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ కొనుగోలు ధరను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది. ఈ ఉదయం లేక్‌వ్యూ అతిథిగృహంలో ఉపసంఘం భేటీ అయి సౌర విద్యుత్‌ కొనుగోలు ధర, బిడ్ల ఖరారుపై చర్చించింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే…

సూట్‌కేసులో ఉన్న మృతదేహాం

హైదరాబాద్‌: నగర శివార్‌లలోని నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోకాపేటలో సూట్‌కేసులో ఉంచిన ఓ మృతదేహం కలకలం రేపింది. ఎక్కడో హత్య చేసి మృత దేహాన్ని సూట్‌కేసులో ఉంచి ఉక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర ఆధారాల…