Thursday, 5 November 2026

తెలంగాణ

ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన పలువురి నాయకులు

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఎంపీలు హరికృష్ణ సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, సినీ నటుడు బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని…

బ్రాహ్మణయ్య మృతికి టీడీపీ అధ్యక్షుడు

విశాఖ: ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి బ్రాహ్మణయ్య ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు.

గూడూరు వేళ్లనున్న బయ్యారం బృందం

వరంగల్‌ : బయ్యారం గనుల పరిశీలనకు తెరాస నేతలు వరంగల్‌ నుంచి ఈ ఉదయం బయలుదేరివెళ్లారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం గూడూరు, బయ్యారం గనులను పరిశీలించనుంది.

తెరాసలో చేరనున్న రమణాచారి

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమణాచారి తెరాసలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత కేసిఆర్‌ సమక్షంలో ఆయన చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

వొకేషనల్‌ కోర్సులో శ్రీకాకుళం ప్రథమ స్థానం

హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో వొకేషనల్‌ కోర్సులో 46,54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో 65శాతం ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 30 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్‌ జిల్లా చివరి…

ఇంటర్‌ 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు

హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలను మంత్రి పార్థసారథి విడుదల చేశారు. 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. గతేడాదితో పోలిస్తే 0.85శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. జనరల్‌ కేటగిరీలో 8,91,337 మంది పరీక్ష రాయగా…

ఉదయం 9గంటలకు ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 9గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను గ్రేడ్లతోపాటు మార్కులను అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.

రిలీవింగ్‌కు అనుమతి లభించిన 1800 మంది ఉపాధ్యాయులు

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు ఖరారు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1800 మంది ఉపాధ్యాయుల రిలీవింగ్‌కు అనుమతి లభించింది. బదిలీ అయినవారు కొత్తస్థానాల్లో ఈనెల 24న చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చినా సీఎం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. స్థానికంగా కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసినప్పటికీ తెరాస, తెదేపాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నానయని…