అల్లూరు : నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని సింగపేట పొలాల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వట్టికాల జయరామయ్య (50) అనే రైతు సజీవదహనమయ్యాడు. పొలం వద్ద గుడిసెలో నిద్రిస్తుండగా సమీపంలో ఉన్న 11కె.వి. విద్యుత్ తీగలు గుడిసెపై తెగిపడటంతో అగ్నిప్రమాదం సంభవించింది.




