అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. పుట్లూరు మండలం గాండ్లపాడు మాజీ సర్పంచ్ నీలకంఠారెడ్డి ఈ తెల్లవారుజామున ప్రత్యర్థులు దారునంగా చంపారు. నీలకంఠారెడ్డి, అతని ప్రియురాలు ప్రమీల బైక్ పై వెళ్లుండగా సుమోల్లో వచ్చిన దుండగులు వాహనాన్ని ఢీకొట్టారు.
వేటకొడవళ్లతో నీలకంఠారెడ్డిని అక్కడికక్కడే కిరాతకంగా హత్య చేశారు. ప్రమీలను కూడా చంపేసి ఆ పక్కనే ఉన్న పొలంలో పాతిపెట్టారు. అక్రమ సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యల నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.




