Wednesday, 4 November 2026

అవి రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు సీఎం

విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 355 అదర్శ పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా తేగాడలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా, వైకాపా పార్టీలు రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలని విమర్శించారు. అనకాపల్లి చక్కెర కర్మాగారంపై ఉన్నత స్థాయి బృందాన్ని నియమించామని తెలిపారు. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *