-జస్టిన్ ఎన్వీ రమణ
విజయవాడ : ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్‌లు చక్కని వేదికలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో మెగా లోక్ అదాలత్‌లను ఆయన ప్రారంభించారు. ఉచితంగా న్యాయం అందించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు సహకరించాలని ఆయన కోరారు. లోక్ అదాలత్‌ల ద్వారా 1,48,286 కేసులు పరిష్కరించామని తెలిపారు. ఏళ్ల తరబడి న్యాయం కోసం ప్రజలు ఎదురుచూడటం బాధాకరమని జస్టిన్ రోహిణి అన్నారు. లోక్ అదాలత్‌లు మానవ సంబంధాలు పెంచుకునేందుకు దోహదం చేస్తాయని చెప్పారు.




