విజయనగరం: బొండపల్లి మండలం దేవ్‌పల్లి వీఆర్వో మురళీధర్ ఓ రైతు వద్ద నుంచి రూ. 5వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దేవ్‌పల్లి గ్రామానికి చెందిన మూకపల్లి తిరుపతిరావు అనే రైతుకు పట్టాదారు పాన్‌పుస్తకం జారీ చేసేందుకు రూ. 25వేలు డిమాండ్ చేశాడు. ఈ మేరకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా బుధవారం తిరుపతిరావు వద్ద నుంచి రూ. 5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని వీఆర్వోను పట్టుకున్నారు.




