కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ కిరాణ దుకాణంలోకి నిన్న రాత్రి ముగ్గురు దొంగలు ప్రవేశించి చోరీకి యత్నించారు. దుకాణం యజమాని అప్రమత్తమై దొంగలను అడ్డుకోవడానికి యత్నించడంతో అతన్ని కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం. అందుకున్న గ్రామస్థులు పారిపోతున్న వారిలో ఒకరిని పట్టుకున్నారు. దుకాణం యజమానిని వానపల్లి ఆసుపత్రిలో చేర్పించి దొంగను పోలీసులకు అప్పగించారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




