నల్లజెర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం చీపురుగూడెం రామాలయం భూముల్లో వెలిసిన గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఉదయం పోలీసుల సహాయంతో అధికారులు గుడిసెల తొలగింపు చేపట్టారు. అయితే ఈ చర్యను దళితులు అడ్డుకొని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు నల్లజెర్లలో 144 సెక్షన్ విధించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.




