విజయనగరం,(జనంసాక్షి:) విజయనగరం జిల్లా రామభద్రాపురంలో ఆన్లలైన్ రుణాల పేరిట కోటి 83 లక్షల సొత్తు కాజేసిన బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేసే వారణాసి బాలకృష్ణకు ఓ విదేశీ కంపెనీ నుంచి లాటరీలో మూడు కోట్లు వచ్చాయంటూ సమాచారం అందింది. బాలకృష్ట వారిని సంప్రదించగా వారు వివిధ కారణాలను చూసి కొంత డబ్బు చెల్లించమన్నారు. దీంతో కోటి 86 లక్షలు సదరు కంపెనీకి అతగాడు చెల్లించాడు. ఈ డబ్బును సమకూర్చే సమయంలో ఆన్‌లైన్ రుణాల పేరుతో తాను పనిచేస్తున్న బ్యాంఖ్ నుంచే బాలకృష్ణ సొమ్ము స్వాహా చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.




