Tuesday, 3 November 2026

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్‌

తిరుమల: లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ తిరుమల శ్రీవారిని మరోమారు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మహద్వారం వద్దకు చేరుకున్న మీరాకుమార్‌కు తితిదే చైర్మన్‌ కనుమూరి బాపిరాజు స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో మీరాకుమార్‌కు అలయ అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాదాయ శాఖమంత్రి సి. రామచంద్రయ్య, తిరుపతి ఎంపీ చింతామోహన్‌ స్పీకర్‌తోపాటు స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *