విశాఖపట్నం : వీధి బాలల కోసం నగర పోలీసులు నిర్వహిస్తున్న స్వచ్ఛంధసంస్థ పాపాహోంకు చెందిన బాలికల వసతి గృహాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. పోలీస్ బ్యారెక్స్‌లో ఉన్న ఈ హోంలో ఇప్పటివరకు కేవలం బాలురకే వసతి కల్పిస్తున్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా వసతి గృహం ఉంటే బాగుంటుందని భావించిన పోలీసులు రూ.50 లక్షలతో సీతమ్మధారలో మరో భవనాన్ని నిర్మించారు. పది మంది పిల్లలతో దీనిని ప్రారంభించామని.. బాలికలకు పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.




