ఒంగోలు: నగరంలో గత అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. గాలుల ఉద్ధృతికి నగరంలోని సెంట్రల్‌కేఫ్ వద్ద 150 ఏళ్ల చరిత్ర ఉన్న వేపచెట్టు కూలిపోయింది. మూడు రోడ్ల కూడలిలో భారీ చెట్టు పడిపోవడంతో ఉదయం పదిగంటల వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒంగోలు చరిత్రలో ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జిల్లాలో సంచలనాలు కలిగించిన అనేక తీపి, చేదు జ్ఞాపకాలకు మధుర స్కృతిగా ఈ మహా వృక్షం నిలిచివుండేది. ప్రకాశం పంతులు రాజకీయ సమావేశాలు ఇక్కడే నిర్వహించేవారిని స్థానికులు చెప్తున్నారు. శుభకార్తాల సమయంలో చెట్టుకు పూజలు చేసేవారమని, ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ చెట్టు కూలిపోవడంతో తమ అత్మీయుడిన కోల్పోయిన భావన కలుగుతోందని స్థానికులు పేర్కొన్నారు.




