అనంతపురం: అనంతపురం జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 145కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం సమర్ధంగా అమలు చేయడం ద్వారా జిల్లాలో వలసలు తగ్గించగలిగామని చెప్పారు. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.




