విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పడీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు రాష్ట్రంలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా, తెలంగాణ, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. క్యుములో నింబస్ మేఘాల వల్ల బలమైన ఈదురుగాలు వీచి, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.




