Wednesday, 4 November 2026

రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే సూచనలున్నాయి

విశాఖ: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు క్యుములోనింబన్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలో పలు చోట్ల, ఉత్తర కోస్తా, తెలంగాణ , రాయలసీమల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్యుములోనింబన్‌ మేఘాల ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సైతం పడే అవకాశం ఉందని… పంటపొలాల్లో పనులు చేసుకునే రైతులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *