Tuesday, 3 November 2026

రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశం

విశాఖ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నెరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, మరో 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నైరుతి ప్రవేశించి అవకాశం ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *