మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని రెండు చోట్ల అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దువ్యూరు మండలం కానగూడూరు వద్ద టాటా ఐషర్ వాహనంతో అక్రమంగా తరలిస్తున్న 30 దుంగలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన హోంగార్డు దస్తగిరిని అరెస్టు చేశారు. మరోచోట వనిపెంట ఠాణా వద్ద టాటా సఫారిలో తరలిస్తున్న 20 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.




