పొదలకూరు, జనంసాక్షి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో డివిజన్‌స్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదంటూ వైకాపా నాయకులు చేసిన వాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ కింద రూ. 5 వేల కోట్లు రైతులకు అందజేసినట్లు వివరించారు. యాంత్రీకరణ పనిముట్ల కోసం రూ. 2500 కోట్లు సబ్సిడీ రూపంలో రైతులను అందించామన్నారు అలాగే తెలుగు గంగలో అంతర్భాగమైన కండలేరు, సోమశిల జలాశయాల ద్వారా 2.65 లక్షల ఎకరాలకు సాగునీరందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ ఆర్డీవో మాధవీలత, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




