విజయవాడ: గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేయాలంటూ తెలుగుదేశం మహాధర్నా నిర్వహించింది. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ నగరాల్ని గ్రేటర్‌గా ప్రకటించిన కాంగ్రెస్ పాలకులు విజయవాడను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఫలితంగా నగరం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని… దీనికి ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవితో పాటు మంత్రి పార్థసారధి బాధ్యత వహించాలని ధ్వజ మెత్తారు.




