కడప : కడప ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్ధిని సమాధాన పత్రం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. అభ్యాన్ జూనియర్ కళాశాలకు చెందిన శివపావని రాసిన గణితం 1బి పరీక్ష సమాధానపత్రం గల్లంతైంది. సమాధాన పత్రం గల్లంతుపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు.




