కడప నేరవిభాగం: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు తమ రాజీనామా పత్రాలను కడప జిల్లా సమైక్యాంధ్ర ఐకాస కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డికి అందజేశారు. స్థానిక హరిత హోటల్‌లో అదివారం సమైక్యాంధ్ర ఐకాస సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వీరు… సమావేశానంతరం రాజీనామాలను సమర్పించారు. రాయచోటి వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాసులు, జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి, శాసనమండలి సభ్యులు నారాయణరెడ్డి, పచ్చల పుల్లయ్య రాజీనామాలు సమర్పించిన వారిలో ఉన్నారు.




