విశాఖ: సింహాచలం గోశాలలో గోవులు మృత్యువాత పడుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. సింహాచలం గోశాల నుంచి 350 గోవులను కృష్ణాపురంలోని తాత్కాలిక షెడ్లకు తరలించారు. మెరుగైన వైద్యం, సౌకర్యాల కోసం గోవులను తరలించనట్లు అధికారులు తెలిపారు. సింహాద్రి అప్పన్నకు కోడె దూడలను కానుకగా ఇచ్చే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు. కోడెదూడలకు బదులుగా కానుకల రూపంలో మొక్కులు తీర్చుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.




