Tuesday, 3 November 2026

సీపీఐ ఆధ్వర్యంలో కడప యూరేనియం ప్లాంట్‌ వద్ద ఆందోళన

కడప,(జనంసాక్షి): కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌ వద్ద సీపీఐ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన బధవారం ఉద్రిక్తంగా మారింది. యురేనియం 2 వ ప్లాంట్‌ వద్దంటూ ఈసీఐఎల్‌ గేటు ముందు నారాయణతో సహా సీపీఐ నాయకులు ధర్నాకు దిగారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర తోపులాటల మధ్య పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 73 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఇతర వనరులుండగా ప్రభుత్వం కేవలం ప్రమాదకరమైన యురేనియంను ప్రజల నెత్తిన రుద్దుతుందని మండిపడ్డారు. ఉపాధి కల్పించే పరిశ్రమలు ఇవ్వమని కోరితే ప్రాణాలు తీసే పరిశ్రమలు ఇస్తుందని ఆయన విమర్శించారు. యురేనయం వల్ల వచ్చే అనర్థాలను కప్పిపెట్టేందుకు ఈసీఐఎల్‌ ప్రయరత్నిస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *