Tuesday, 3 November 2026

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడిరది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపరితల అవర్తన మరింత బలపడి… రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *