Wednesday, 4 November 2026

September 2012

Featured News

అమెరికా దౌత్య వాహనం లక్ష్యంగా

పాక్‌లో ఆత్మాహుతి దాడి ముగ్గురు మృతి ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు అమెరికన్లు సహా…

Featured News

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం వద్దు

హైకోర్టులో పిటీషన్‌ దాఖలు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనానికి అనుమతి ఇవ్వద్దంటూ వేసిన ఒక పిటిషన్‌ను సోమవారం హైకోర్టు స్వీకరించింది.…

Featured News

రాజ్యాంగానైనా సవరించండి

తెలంగాణ ఏర్పాటు చేయండి తెలంగాణ సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం సురవరం సుధాకర్‌రెడ్డి హోరెత్తిన ఓ(పో)రుగల్లు.. ఆట్టుకున్న ఎర్రదండు కవాతు ముగిసిన తెలంగాణ ప్రజాపోరు వరంగల్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యాంగపరమైన సమస్యలుంటే అవసరమైతే…

Cover Story

జంతర్‌ మంతర్‌ వద్ద మార్మోగినజై తెలంగాణ

తెలంగాణ ఇకనైనా ప్రకటించండి ముల్కీ అమరుల స్ఫూర్తితో సెప్టెంబర్‌ 30న ధూంతడాఖా చూపెడతాం జేఏసీ చైర్మన్‌ కోదండరాం న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని ఇకనైనా ప్రకటించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ముల్కీ అమరుల స్పూర్తితో తెలంగాణ పోరాటాన్ని…

వరంగల్

వాగులో చిక్కుకున్న కారు

వరంగల్‌: భారీ వర్షానికి ఆత్మకూరు మండలం సింగారంలో వాగు ఉధ్దృంగా ప్రవహిస్తోంది. వాగు మధ్యలో కారు చిక్కుకుంది. కారులో నలుగురు ప్రయాణికులన్నట్లు సమాచారం. స్థానికులు తాడు సహాయంతో కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నింస్తున్నారు.

వార్తలు

టర్కీలో కుర్దు తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు: 29 మంది మృతి

దియార్‌బకీర్‌(టర్కీ) : టర్కీలో కుర్దు తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణల్లో 29 మంది చనిపోయారు. ఆదివారం రాత్రి నిషేధిత కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ సభ్యులు తుపాకులు, రాకెట్‌ లాంఛర్లతో టర్కీ ఆగ్నేయ ప్రాంతంలోని బెతుస్సేబావ్‌లో ఉన్న భద్రతా…

వార్తలు

ఎన్‌హెచ్‌ కపాడియా తర్వాత సీజేఐగా అల్తామన్‌ కబీర్‌

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్న చీఫ్‌ జస్టిస్‌ అఫ్‌ ఇండియా (సీజేఐ) ఎన్‌హెచ్‌ కపాడియా తన తర్వాతి సీజేఐగా సీనియర్‌ జడ్జి జస్సిస్‌ అల్లామన్‌ కబీర్‌ని సిఫార్సు చేశారు. ఈ మేరకు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి.…

వార్తలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కటాఫ్‌ మార్కుల మార్పు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షకు కటాఫ్‌ మార్కుల్ని మార్చింది. కొత్తగా కటాఫ్‌ మార్కుల్ని 91గా నిర్ణయించింది. తాజా కటాఫ్‌ మార్కులతో 848 మంది మెయిన్స్‌కు అర్హత కోల్పోనున్నారు.

వార్తలు

అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి

అమెరికా కాన్సులేట్‌ వాహనం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి ఇస్లామాబాద్‌: అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు అమెరికన్లు సహా 19 మంది…

వార్తలు

ఇనుప గనుల తవ్వకాలపై పక్షికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కర్ణాటకలో ఇనుప ఖనిజం గనుల తవ్వకాలపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. లీజు నిబంధనలు ఉల్లంఘించని కంపెనీలకు మాత్రమే వర్తించేలా నిషేధాజ&ఙల్ని సడలించింది. కూటగిరీ-ఎగా వర్గీకరించిన 45 లీజుల్లో తవ్వకాలకు అనుమతించవచ్చని సీఈసీ సఫారసు చేసింది.…