Tuesday, 3 November 2026

January 2013

హైదరాబాద్

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌ నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని పార్టీ అధిష్ఠానం, కేంద్రం చేసిన ప్రకటనలపై మండిపడుతున్న ఎంపీలు కాంగ్రెస్‌ పెద్దలపై ఒత్తిడి పెంచే వ్యూహం…

హైదరాబాద్

సీఎం పదవిపై ఆశతోనే జానా అలా మాట్లాడుతున్నారు : నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇందిరాపార్కు వద్ద సమరదీక్షలో నారాయణ పాల్గోని మాట్లాడారు. అఖిలపక్షానికి కాంగ్రెస్‌ అన్ని పార్టీలను పిలిచి అవమానించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే కాంగ్రెస్‌…

హైదరాబాద్

తెలుగును విధిగా బోధించాలన్న ప్రతిపాదనకు ఆమోదం

హైదరాబాద్‌: ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో తెలుగును విధిగా భోధించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రంలోని సుమారు లక్ష పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఆంగ్లంతోపాటు తెలుగును…

హైదరాబాద్

తెలంగాణ ప్రక్రియను వైకుంఠపాళిలాగా మార్చారు : నారాయణ

హైదరాబాద్‌:  తెలంగాణ ప్రక్రియను కాంగ్రెస్‌ వైకుంఠపాళిలాగా మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలంగాణపై మరిన్ని  సంప్రదింపులు అవసరమంటూ ఆజాద్‌, షిండే చేసిన ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణపై చర్చలంటూ సమస్యను మళ్లీ మొదటికి తెచ్చారని ఆరోపించారు.…

జిల్లా వార్తలు

సంగారెడ్డి కోర్టులో అక్బరుద్దీన్‌ను హాజరుపరిచిన పోలీసులు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఇందు కోసం ఆయన్ను ఈ ఉదయం ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డికి తరలించారు. ఇదే కేసులో హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీ…

హైదరాబాద్

గవర్నర్‌ను కలిసిన మంత్రి జానా

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని ఆజాద్‌, షిండే ప్రకటనల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన గవర్నర్‌కు వివరిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

హైదరాబాద్

ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ  స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం .జారీ చేసింది. ఇందులో మూడు పట్టభద్రులు, మూడు ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు.…

వార్తలు

విశ్వరూపం విడుదలపై విచారణ రేపటికి వాయిదా

చెన్నై : కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంతో వచ్చిన ‘ విశ్వరూపం’ సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్‌పై విచారణను మద్రాస్‌ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ అంశలోకమల్‌హాసన్‌ ప్రభుత్వాధికారులతో చర్చలు జరపాలని కోర్టు సూచించింది. సినిమాపై పలు…

హైదరాబాద్

సమరదీక్షకు భారీగా తరలివస్తున్న తెలంగాణవాదులు

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద రెండో రోజు సమరదీక్షకు తెలంగాణవాదులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఉదయం తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు టీఎన్జీవో నేతలు దీక్ష స్థలికి వచ్చారు. ఈ సాయంత్రంతో ముగియనున్న సమరదీక్షలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు ,…

హైదరాబాద్

మంత్రి జానారెడ్డి నివాసంలో భేటీ కానున్న తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణపై ఆజాద్‌, షిండే ప్రకటనల నేపథ్యంలో మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.