Wednesday, 4 November 2026

January 2013

జిల్లా వార్తలు

కేయూలో వీసీ ఛాంబర్‌ ఎదుట విద్యార్థుల ఆందోళన

వరంగల్‌ : తెలంగాణకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్‌ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోకి పోలీసుల ప్రవేశం, విద్యార్థుల అరెస్టులను వ్యతిరేకిస్తూ పెట్రోలు సీసాలను చేతిలో పట్టుకొని నిరసనకు దిగారు. తెలంగాణవాదులను అణచివేసే చర్యలను మానుకోవాలని…

హైదరాబాద్

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ బతకదు :పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ బతకదని అన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తెరాస నేతలతోపాటు తెలంగాణ…

హైదరాబాద్

నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌లో నిజాం కళాశాల వసతిగృహం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహ విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేసిన సైఫాబాద్‌ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళనతో బషీర్‌బాగ్‌ మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

జిల్లా వార్తలు

సంగారెడ్డి కోర్టులో హాజరైన అసదుద్దీన్‌

సంగారెడ్డి : కలెక్టర్‌ దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌తోపాటు నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు సంగారెడ్డి న్యాయస్థానంలో ఈ ఉదయం హాజరయ్యారు. ఎంఐఎం నేతల హాజరు అయిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు…

వార్తలు

ఈజిప్టులోని పలు నగరాల్లో ఎమర్జెన్సీ

కైరో : ఈజిప్టులో ఆందోళనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మోర్సీ పలు నగరాల్లో ఎమర్జెన్సీ విధించారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో మూడు తీరప్రాంత నగరాలు పోర్ట్‌సెడ్‌, సీయెజ్‌, ఇస్మేలియాల్లో రాత్రి  కర్ఫ్యూతోపాటు ఎమర్జెన్సీని నెలరోజులపాటు అమలు…

హైదరాబాద్

ఐకాస స్టీరింగ్‌ కమిటీ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: ఇందిరాపార్కు సమర దీక్ష ప్రాంగణంలో తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ ఈ ఉదయం అత్యవసరంగా భేటీ అయింది. కోదండరాంతోపాటు తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఉద్యోగ సంఘాల నేతల ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమర దీక్ష ఈ…

హైదరాబాద్

ఇందిరాపార్కు వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: సమర దీక్ష నేపథ్యంలో ఇందిరాపార్కు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇందిరాపార్కు నుంచి వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమరదీక్ష వద్ద భారీగా…

హైదరాబాద్

కాంగ్రెస్‌ తప్పుడు విధాన ప్రకటనల వల్లే నేతలపై దాడులు : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని మరిన్ని సంప్రదింపులు అవసరమని షిండే, ఆజాద్‌ ప్రకటనలపై రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. కాంగ్రెస్‌ తప్పుడు విధాన ప్రకటనల వల్లే ఆయా నేతల పై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై ఒత్తిడి…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు పోమవారం  లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 4 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని కాంగ్రెస్‌ అధిష్ఠానం, కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ ఉదయం 11 గంటలకు భేటీ అవుతున్నారు. పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో భేటీ…