Thursday, 5 November 2026

February 2013

జిల్లా వార్తలు

మద్యం మత్తులో కుటుంబసభ్యుల పై గొడ్డలితో దాడి ముగ్గురి పరిస్థితి విషయం

వరంగల్‌:ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్య పై గొడ్డలతో దాడికి దిగాడు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి, అక్కల పై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.…

జిల్లా వార్తలు

అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

వరంగల్‌ ఖానాపురం: మండలంలోని అశోక్‌నగర్‌ గ్రామానికి చెందిన గంపయ్య (35) అనే కూలీ ఆర్థిక ఇబ్బందులతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ పోషణ కోసం తీసుకువచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్ల కుటుంబసభ్యులు తెలిపారు. ఇతనికి ముగురు…

ఆదిలాబాద్

వర్షం బాధితులకు సాయం

ఆదిలాబాద్:మండలంలో అకాల వర్షం.ఈదురు గాలుల కారణంగా నివాసాలు కోల్పోయిన వారికి ఉప పాలనాధికారి బాలాజీ మంజులే బియ్యం పంపిణీ చేశారు. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి రూ.15వేలు, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు రూ.1900 అందజేయ నున్నట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్

బ్రదర్‌ అనిల్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి : వీహెచ్‌

హైదరాబాద్‌: తనపై వస్తున్న ఆరోపణలపై బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. తమకు అన్యాయం జరిగిందంటూ మణికొండ బాధితులు చెప్తుతున్నారని వాస్తవాలు లేకుండా ఎవరూ అలా చెప్పరని వ్యాఖ్యానించారు.…

కరీంనగర్

అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోంది: టీ కాంగ్రెస్‌ ఎంపీలు

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ అంశంలో అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. తెలంగాణ అంశం తుది దశకు చేరిందని ఇందుకు కోర్‌కమిటీ సమావేశాలే నిదర్శమని చెప్పారు.

హైదరాబాద్

పంచాయతీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు : మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌

హైదరాబాద్‌: పంచాయితీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరపడం సమంజసమని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాని నిధులను కోల్పోకుండా చర్యలు తీసుకున్నామని, స్థానిక…

హైదరాబాద్

స్థానిక ఎన్నికలకు సుప్రీం అనుమతి

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి కట్టుబడి ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.…

హైదరాబాద్

మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారం : రఘువీరా

హైదరాబాద్‌: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలపై వారం రోజుల్లో నివేదిక పంపాలని మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రెండు రోజులు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. సమావేశం…

కరీంనగర్

సహకార సంఘం ఛైర్మన్‌ను తీసుకువెళ్లిన కాంగ్రెస్‌ నేతలే

కరీంనగర్‌: బీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన కాల్వశ్రీరాంపూర్‌ సహకారసంఘం ఛైర్మన్‌ శ్యాంసుందర్‌ను…

వార్తలు

కాగజ్‌నగర్‌ను సందర్శించిన మంత్రి సారయ్య

కాగజ్‌నగర్‌: పట్టణంలోని కాలనీల్లోని పలు వార్డులను జిల్లా ఇంఛార్జి మంత్రి సారయ్య, ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు. ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య సందర్శించారు. ఖారీ వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని బాధితులకు వారుహామీ ఇచ్చారు.