Monday, 2 November 2026

February 2013

హైదరాబాద్

తెరాసకు పొత్తులు, ఎత్తులు తప్ప మరో ధ్యాస లేదు : పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: తెరాసకు పొత్తులు, ఎత్తులు,  టికెట్లు తప్ప మరో ధ్యాస లేదని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. 2004,2009 ఎన్నికల్లో ఓడిలోయినవారికి టికెట్లు ఎవరిచ్చారో కేసీఆర్‌ చెప్పాలని పెద్దిరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్‌ను రాజకీయ బడ్జెట్‌గా మార్చారని…

అంతర్జాతీయం

కాగ్నిజెంట్‌ ఉద్యోగుల బోనన్‌లో కోత

చెన్నై: 2012 సంవత్సరానికిగాను కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బోనన్‌లు తగ్గనున్నాయి. దీనికి కారణం 2012 సంవత్సరంలో సంస్థ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోవడమే. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2012 లో బోనస్‌లు 90- 145 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది.…

హైదరాబాద్

పోలవరంపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశం

హైదరాబాద్‌ పోలవరంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సచివాలయంలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, విదేశాల్లో పని అనుభవంపై నివేదికను ఈ కమిటీ పరిశీలిస్తోంది.

హైదరాబాద్

సీఎంతో బొత్ససత్యనారాయణ భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంపై వీరు చర్చిస్తున్నాట్లు సమాచారం తెలిసింది.

హైదరాబాద్

” 26/11 ఇండియాపై దాడి ” సినిమా పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: ‘ 26/11 ఇండియాపై దాడి’ సినిమాకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ మార్చి 5కి వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ప్రతివాదులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్

ఐటీ అంటే.. ఇండియన్‌ టాలెంట్‌ : పొన్నాల

హైదరాబాద్‌: ప్రతక్షంగా, పరోక్షంగా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఐటీ అంటే ఇండియన్‌ టాలెంట్‌ అన్న మంత్రి దేశానికి ప్రతిభ కలిగిన యువత అవసరం చాలా ఉందని పేర్కొన్నారు.…

సీమాంధ్ర

సింగరంపాలెం వద్ద ట్రాక్టర్‌ బోల్తా :నలుగురు మృతి

గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా సింగరంపాలెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సింగరంపాలెంకు చెందిన ముఠా కూలీలు పనికి వెళ్లి తిరిగి ట్రాక్టర్‌పై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.…

జాతీయం

అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమత

కోల్‌కతా : కోల్‌కతా సూర్యసేన్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల,…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,810గా ఉంది. కిలో వెండి…

జాతీయం

లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబంర బుధవారం లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణం 6.6 నుంచి 6.2 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక సర్వే పేర్కొంది.