Tuesday, 3 November 2026

March 2013

జిల్లా వార్తలు

దాచిన కలప పట్టివేత

సిరికొండ: మండల కేంద్రంలోని లింగారెడ్డి అనే రైతు కొట్టంలో అక్రమంగా దాచిన కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రూ2 లక్షల విలువైన 150 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఇంగల్‌ వాయి రేంజి అధికారి నాగగౌడ్‌ తెలిపారు.

జాతీయం

ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న భాజపా జాతీయ సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్టు ఆయన తెలియజేశారు.

హైదరాబాద్

బాబ్లీ వైఎస్‌ నిర్లక్ష్యం వహించారు : మధుయాస్కీ

హైదరాబాద్‌: మహారాష్ట్ర చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్లక్ష్యం వహించారని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది సొంత కాంట్రాక్టర్లు కావడంతో ప్రాజెక్టును వైఎస్‌ అడ్డుకోలేదని ఆయన…

హైదరాబాద్

బడ్జెట్‌లో మైనార్టీలకు అన్యాయం : లాల్‌జాన్‌ భాష

హైదరాబాద్‌: 2013-14 కేంద్ర బడ్జెట్‌లో మైనార్టీలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం నేత లాల్‌జాన్‌భాషా ఆరోపించారు. దాదాపు 16 లక్షల కోట్ల బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి కేవలం రూ. 3 వేల కోట్లును కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు.

హైదరాబాద్

ఘనంగా మజ్లిన్‌ ఆవిర్భావదినోత్సవం

హైదరాబాద్‌: మజ్లిన్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమాన్‌ (ఎంఐఎం) పార్టీ 55వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో పార్టీ పతాకాన్ని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, కార్యకర్తలు,…

హైదరాబాద్

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో ఆడుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆస్ట్రేలియా స్కోరు 208 వద్ద ఆటగాడు వెడ్‌ను (62 పరుగులు) హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లో కుమార్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

జాతీయం

అత్యంత ప్రజాకర్షణ గల నేత మోడీ : రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. దేశరాజధానిలో ప్రారంభమైన భాజపా జాతీయ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి…

జాతీయం

దేశరాజధానిలో భద్రత పెంపు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో భద్రతను పెంచారు. మంగోల్‌పురి ప్రాంతంలో పాఠశాల విద్యార్థిని అత్యాచారానికి గురికావడంపై ప్రజలు ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే. ప్రజల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.

హైదరాబాద్

నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌ – ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. మొదట్లో వడివడిగా నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ క్లార్క్‌ 75, వేడ్‌ 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. కడపటి సమాచామందేసరికి ఆస్ట్రేలియా…

జిల్లా వార్తలు

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నిజామాబాద్‌ : నిజమాబాద్‌ జిల్లాలోని అర్సపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.