Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

సాగునీటి విషయంలో రైతుల ఆందోళన

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని బొప్పాన్‌పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్‌ కెనాల్‌ 26 వద్ద ఆయకట్టు రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక పక్క పంట ఎండిపోతుంటే తూమును ఎందుకు మూసివేశారని అధికారులను నిలధీశారు.…

జిల్లా వార్తలు

రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన సీఎం

మహబూబ్‌నగర్‌ : రెవెన్యూ సదస్సును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలం మండపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రులు రఘు వీరారెడ్డి, డీకే అరుణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.…

జాతీయం

రాంసింగ్‌ది ఆత్మహత్యే

శవ పరీక్ష అనంతరం తేల్చిన వైద్యులు న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు రాంసింగ్‌ మృతదేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శవపరీక్ష నిర్వహించారు. రాంసింగ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శవపరీక్ష అనంతరం…

హైదరాబాద్

విద్యుత్‌ సౌధ ముట్టడిలో బీజేపీ నేతలు అరెస్టు

హైదరాబాద్‌ : విద్యుత్‌ కోతలు, సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా మంగళవారం బీజేపీ ఆందోళనకు దిగింది. విద్యుల్‌ కోతలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు విద్యుత్‌ సౌధను ముట్టడించేందుకు యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

ఖమ్మం

విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని భాజపా ఆందోళన

ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు కోతలను ఎత్తివేయాలంటూ జిల్లా భాజపా ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎన్‌ ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తి…

కరీంనగర్

తహశీల్దార్‌ కార్యాలయం ముట్టడి

చిగురుమామిడి: విద్యుత్తు కోతలకు నిరసనగా మండల సీపీఐ కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్‌ కార్యాలయాన్ని దిగ్భంధించారు. అధికారులను లోనికి వెళ్లకుండా కార్యాలయం తలుపులు మూసివేసి కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్

నిర్మల్‌లో వైకాపా ఆవిర్భావ వేడుకలు

నిర్మల్‌: నిర్మల్‌లో మంగళవారం వైకాపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

శామీర్‌ పేటలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌: శామీర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు వ్యక్తులపై దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 2లక్షల నగదును దోచుకెళ్లారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు ఆసుపత్రికి…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు

ఖమ్మం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులు కరపత్రాలు అంటించారు. ఇల్లందు మండలం కొమరారం, పోలారం గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మావోయిస్టుల పేరుతో కరపత్రాలు అంటించడం కలకలం సృష్టించింది. న్యూడెమోక్రసీపార్టీని విమర్శిస్తూ పోస్టర్లు అంటించారు. ఆ పార్టీ పోలీసులకు…

జిల్లా వార్తలు

భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 25 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విదాచారిస్తున్నారు.