Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

ప్రజాసమస్యలపై చర్చకు సిద్ధం

హైదరాబాద్‌ : పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేవారిని త్వరలోనే గుర్తించి చర్యలు తీసుకుంటామని శాసనసభ వ్యవహారల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్‌లో ఆయారాం, గయారాంల సంస్కృతిని నియంత్రించేందుకు పార్టీ నేతలు ఇప్పటికే చర్యలు ప్రారంభించారని ఆయన చెప్పారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో…

జిల్లా వార్తలు

రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి

వికారాబాద్‌: మండలంలోని ఐనాపూర్‌ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్‌ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.

అంతర్జాతీయం

వెనెజువెలా అధ్యక్ష స్థానానికి మాడ్యురో నామినేషన్‌

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల పోరు ప్రారంభమైంది. అధికార పార్టీ తరపున తాత్కాలిక అధ్యక్షుడు నికోలన్‌ మాడ్యురో అధ్యక్ష స్ధానానికి నామినేషన్‌ వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో కన్నుమూయడంతో తిరిగి…

జిల్లా వార్తలు

10 ఇసుక లారీల సీజ్‌

రంగారెడ్డి: శంషాబాద్‌ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్‌తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.

అంతర్జాతీయం

హెలికాప్టర్‌ కూలి ఐదుగురు నాటో దళ సభ్యులు మృతి

కాబూల్‌ : దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో నాటో దళానికి చెందిన హెలికాఫ్టర్‌ నేల కూలింది. ఈ ఘటనలో ఐదుగురు నాటో భద్రాతాసిబ్బంది. మృతి చెందారు. హెలికాఫ్టర్‌ ప్రమాదానికి కారణాలు తెలియారాలేదు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో శత్రువులు కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు…

జిల్లా వార్తలు

నగరంలోకి ప్రవేశించిన మునుగోడు ఎమ్మెల్యే పాదయాత్ర

అబ్దుల్లాపూర్‌మెంట్‌: దిండి-నక్కలగండి ఎత్తిపోతల పథకానికి పరిపాలన ఆమోదం ఇవ్వాలని, శ్రీశైల సొరంగ మార్గానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని సీపీఐ నేతృత్వంలో మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు చేపట్టిన పాదయాత్ర హయత్‌నగర్‌ మండలం కొత్తగూడెం మీదుగా నగరంలోకి ప్రవేశించింది. ఈ…

జాతీయం

పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళలు దుస్ధితిపై లోక్‌సభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సభ్యులు తమ పట్టును వీడకపోవడంలో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నానికి వాయిదా…

జిల్లా వార్తలు

మాక్లూరు పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌

మాక్లూరు: నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌ చోటుచేసుకోవడంతో ఇద్దరు అధికారులను ఆర్‌ఐవో విధుల నుంచి తొలగించారు. కలెక్టర్‌ క్రిష్టిన్‌ ఆదేశాలతో ఆర్‌ఐవో ఈ ఉదయం ఆకస్మికంగా పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షా…

హైదరాబాద్

విశాఖలో మావోయిస్టు అరెస్ట్‌

విశాఖ : మావోయిస్టుపార్టీ గాలికొండ దళసభ్యుడు సుబ్బారావును విశాఖ జీకే వీధి పోలీసులు అరెస్ట్‌చేశారు. సుబ్బారావు పలుకేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్

హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ

హైదరాబాద్‌ : హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులయ్యారు. ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఈశ్వరయ్య పదవీవిరమణడంతో జస్టిస్‌ రమణను ఆ పదవిలో నియమించారు.