సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎమ్మార్, ఓఎంసీ కేసు నిందితులు
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ కోర్టు ఎదుట బీపీ ఆచార్య, విజయ రాఘవ , కోనేరు ప్రసాద్ ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ముందు హాజరయ్యారు.
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ కోర్టు ఎదుట బీపీ ఆచార్య, విజయ రాఘవ , కోనేరు ప్రసాద్ ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ముందు హాజరయ్యారు.
చిత్తూరు, జనంసాక్షి: అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది టన్నుల ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. రేణిగుంట చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు అధికారులు ప్రయత్నించారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో దగ్గరలోని గాజుల మండ్యం…
న్యూడిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ఈరోజు లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కోరనున్నారు. 2జీ, బొగ్గుకుంభకోణం అంశాలపై గత కొన్ని రోజులుగా భాజపా పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం హాజరయ్యారు.
జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వద్ద ఈ ఉదయం మూడు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
నల్లగొండ, జనంసాక్షి: ఆర్టీసీ బస్సు -ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ భౌతికకాయానికి మారేడుపల్లిలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సినీ నటుడు బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
ముబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్ 50పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నేటి నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెండ్రోజులపాటు తెలంగాణ ఐకాస ధర్నా చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యమకారులు ఢిల్లీకి తరలివస్తున్నారు. ఐకాస అధ్యక్షుడు కోదండరాం…
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్‌గఢ్, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.