Friday, 6 November 2026

April 2013

జాతీయం

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

చత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: బీజాపూర్‌ జిల్లా బాషగూడ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగదల్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు.ల

తెలంగాణ

హత్యకేసులో సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓ హత్యకేసులో సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు నక్సలైట్ల పేరుతో భూమి సెటిల్‌మెంట్లు కూడా చేస్తుంటారు. ఈ ముఠాలోని విజయ్‌ కిరణ్‌ అనే సిఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

ఆదిలాబాద్

108 హోమగుండాలతో శతచండీయాగం

ఆదిలాబాద్‌ సాంస్కృతికం: మావల గ్రామ పంచాయితీ పరిధిలోని దుర్గానగర్‌లో ఉన్న నవదుర్గా మాత మందిరంలో శనివారం శతచండీ మహాయాగం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రారంభమైంది. ఈ యాగం మూడు రోజుల పాటు జరగనుంది. తొలిరోజైన శనివారం గణపతి…

హైదరాబాద్

స్నేహితుడే కీచకుడైతే!

– ఇక అమ్మయిలకు రక్షణ ఎవరు? హైదరాబాద్‌,జనంసాక్షి : మహిళలపై లైంగిక వేధింపులు అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. స్నేహంగా ఉంటున్న వారు కూడా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నగరంలో చదువుతున్న నాగాలాండ్‌ విద్యార్థినిపై…

సీమాంధ్ర

విద్యుత్‌పై ప్రతిపక్షాలది రాద్దాతమన్న సీఎం కిరణ్‌

అనంతపురం, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ రూ. 6వేల కోట్ల భారం వేశారని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని…

కరీంనగర్

రెండు ముక్కలు చేయాలి: జంగాడ్డి

సమావేశంలో మాజీ ఎంపీ జంగాడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలా పార్టీని కూడా రెండు ముక్కలు చేయాలని తెలంగాణ కమిటీపై తన మనసులో మాట బయటపెట్టారు. తొలుత పార్టీ జిల్లా ఇన్‌చార్జి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాల్లేవని, మోడీ ప్రధాని…

సీమాంధ్ర

బాబుకు 2 రోజుల విశ్రాంతి అవసరం: శ్రీనివాస్‌

విశాఖపట్నం, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మోకాలి గాయం తీవ్రంగా ఉందని వైద్యుడు శ్రీనివాసరావు చెప్పారు. ఆయన రెండురోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఆ తరువాత కూడా ఆయన రోజుకు కేవలం 6 కిలోమీటర్లకు మించి నడవకూడదని చెప్పారు.

సీమాంధ్ర

చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు

విశాఖపట్టణం:కాలినొప్పితో బాధపడుతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు.ఆయన కాలినొప్పి తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర కొనపాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెదేపా నేత గరికపాటి మోహనరావు తెలిపారు.ఎల్లుండి చంద్రబాబు 6 కిమీ పాదయాత్ర…

ఖమ్మం

మరోపేరుతో దోపిడీలకు పాల్పడ్డ ఎనిమిది మంది అరెస్టు

పినపాక: జానంపేట గ్రామంలో నక్సలైట్ల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఏడుళ్లబయ్యారం ఎస్సై కె.శ్రీను అరెస్టు చేశారు. గతంలో నక్సలైట్ల పేరుతో దోపిడికి పాల్పడిన రెండు బృందాలు జానంపేట గ్రామంలో మరో దోపిడీకి పథకం రచించేందుకు సమావేశమయ్యారనే…