Tuesday, 3 November 2026

April 2013

తెలంగాణ

ప్రజలు బాబుని శాశ్వతంగా తిరస్కరించారు: శైలజానాథ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. గత ఎన్నికల్లో అన్ని ఉచితమని హామీ ఇచ్చినా ఓటమి చవిచూశారు. ఇప్పుడు మళ్లీ అధికారమిస్తే అన్నీ మార్చేస్తామని చెప్పడంపై వివరణ ఇవ్వాలన్నారు. అధికారంలోకి…

సీమాంధ్ర

కృష్ణానదిలో స్నానానికి వెళ్లి యువకుల దుర్మరణం

గుంటూరు, జనంసాక్షి: కృష్ణానదిలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆ ఇద్దరు యువకులు అమరావతి వద్ద నదిలో దిగి నీటిలో మునిగిపోయారు.

జాతీయం

కర్ణాటలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చిరంజీవి

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచారం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలు పులువురు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పావనగడ నియోజకవర్గంలో చిరంజీవితోపాటు మంత్రులు రఘువీరారెడ్డి, గంటా శ్రీనివాస్‌ ప్రచారంలో పాల్గొన్నారు.

సీమాంధ్ర

దుర్గమ్మను దర్శించుకున్న భన్వర్‌లాల్‌

విజయవాడ, జనంసాక్షి: ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మే 15 నుంచి జూన్‌ 15 వరకు ఓటర్ల జాబితా సవరణలు చేస్తామని చెప్పారు.

కరీంనగర్

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్‌రావు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: డీసీసీబీ అధ్యక్షులు కొండూరి రవీందర్‌రావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంకటాపూర్‌, హరిదాస్‌నగర్‌, మధిర, ఎల్లారెడ్డిపేట , గొల్లపల్లి, బొప్పాపూర్‌, కోరుట్లపేట, బండలింగపల్లి, గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కేంద్రాలను ఆయన ప్రారంభించారు.…

తెలంగాణ

ప్రారంభం కానున్న ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం 9.30 గంటలకు రామయ్య ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఏడు సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, కంపూటర్‌ సైస్స్‌, టెక్నాలజీ, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్‌ జూనియర్‌ కాలేజీలో పరీక్ష…

జాతీయం

బొగ్గు కుంభకోణంపై ఆందోళనకు దిగిన బిజెపి

న్యూఢిల్లీ, బొగ్గు కుంభకోణంపై బిజెపి ఆందోళనలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత జవదేకర్‌ చెప్పారు. మే 4,5 తేదీలలో రాష్ట్రట రాజధానులలో ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ

విదేశీ పర్యనకు వెళ్లిన డిప్యూటీసీఎం

హైదరాబాద్‌: డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలు దేరి వెళ్లారు. హాంకారగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్న సంగతి తెలిసిందే.

సీమాంధ్ర

ఏనుగుల బీభత్సం

చిత్తూరు, బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డిలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. పంటలు, తోటలు భారీగా దెబ్బతిన్నాయి. గ్రామస్తులు భయంతో గ్రామం వదిలివెళ్లిపోయారు.

జాతీయం

నదిలో పడి నలుగురు మృతి

చైన్నై, జనంసాక్షి: తిరుచ్చి వద్ద కావేరి నదిలో ప్రమాదవశాస్తు జారీ పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అయితే వారిని కాపాడేందుకు స్థానికులు చేపట్టిన చర్యలు విఫలమయ్యాయి. ఈఘటన ఆదివారం ఉదయం…