Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

అగ్రస్థానంలో కృష్ణ జిల్లా

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో అగ్రస్థానం కృష్ణజిల్లాకే దక్కింది. ఈ రోజు సాయంత్రం మంత్రి పార్థసారధి విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతంలో కృష్ణా జిల్లా 77 ఉత్తీర్ణత శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్‌ జిల్లా…

తెలంగాణ

ఈసారీ బాలికలదే పైచేయి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ సారీ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 69.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు.

సీమాంధ్ర

ఆగమ పాఠశాలలో విషపూరితమైన ఆహరం

విశాఖపట్నం: సింహచలం ఆగమ పాఠశాలలో ఆహరం విషపూరితమైంది. ఈ ఆహరం తిన్న 20 మంది విధ్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 8 మందిపరిస్థితి విషమంగా ఉంది.వారిని చెస్ట్‌ ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ

ఇంటర్‌లో 65.36 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌,జనంసాక్షి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.

తెలంగాణ

ఖరీదైన సినిమా వీక్షణం

హైదరాబాద్‌, జనంసాక్షి: ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా వీక్షణం మరింత ఖరీదైపోయింది. సినిమా టికెట్‌ ధరలు 10నుంచి 20రూపాయలు మేర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమంయంలో ఐదు తరగతులుగా సినిమా హాళ్లను…

జాతీయం

సునీల్‌ మిట్టల్‌కు మినహాయింపునిచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: అదనపు స్పెక్ట్రం కేటాయింపు కేసులో వ్యక్తిగత హాజరునుంచి భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో సునీల్‌ మిట్టల్‌కు సప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది. మిట్టల్‌ అభ్యర్థనపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.

జాతీయం

ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన భాజపా

న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సప్రీంకోర్టుకు సీపీఐ అఫిడవిట్‌ను సమర్పించిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వంపై భాజపా విమర్శల దాడిని పెంచింది. ప్రధాని రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంలో…

తెలంగాణ

మరికొద్దిసేపట్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయనున్నారు.