Monday, 2 November 2026

April 2013

జాతీయం

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణ

ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించొద్దు : హైకోర్టు

హైదరాబాద్‌ : గ్రూప్‌-1 ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించవద్దంటూ హైకోర్టు ఏపీపీఎస్పీని ఆదేశించింది. మెయిన్స్‌లో తప్పులు దొర్లాయంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు పైవిధంగా స్పందించింది.

జాతీయం

వ్యవసాయ సంపదపై పన్నులేదు

చిదంబరం ఢిల్లీ : వ్యవసాయ రంగంపై సంపద పన్ను లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. జూలై 1,2010 నుంచి అక్టోబర్‌ 1,2012 వరకు రైల్వేకు సేవాపన్ను మినహాయింపు ఉన్నట్లు చిదంబరం పేర్కొన్నారు.

తెలంగాణ

లారీ, బైక్‌ ఢీకొని ముగ్గురి మృతి

హైదరాబాద్‌ : మెదక్‌లోని జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం.

జాతీయం

ప్రధానితో భేటీ అయిన అహ్మద్‌పటేల్‌

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ అంశంపై చర్చించారు.

జాతీయం

బొగ్గు కుంభకోణంపై విచారణ మే 8కి వాయిదా

న్యూఃఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై విచారణను సుప్రీంకోర్టు మే 8కి వాయిదా వేసింది. ఏ నిబంధనల మేరకు దర్యాప్తు నివేదిక వివరాలు చెప్పారో తెలపాలని సీబీఐ డైరెక్టర్‌ను కోర్టు అదేశించింది. ప్రభుత్వానికి నివేదిక విషయాలు తెలిపిన అంశంపై మే…

కరీంనగర్

సన్మాన కార్యక్రమాన్ని బహిష్కరించిన సింగరేణి కార్మికులు

గోదావరిఖని: ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గనులపై చేపట్టే సన్మాన కార్యక్రమాన్ని కార్మికులు, కార్మిక కుటుంబాలు బహిష్కరించాయి. సన్మాన కార్యక్రమానికి తమను అనుమతించకపోవడంతో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో అధికారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని కార్మికులు తప్పుపడుతూ…

కరీంనగర్

మావోయిస్టు మాజీ నేత చంద్రన్నపై దాడి కేసు నమోదు

ముత్తారం:మండలం మచ్చుపేటలో మావోయిస్టు మాజీ నేత బందారపు మల్లయ్య అలియాస్‌ చంద్రన్న అదే గ్రామానికి చెందిన చింతల వీరేశం (43) పైవ్యక్తిగత కక్షలతో సోమవారం దాడి చేశారని ఎస్సై ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు పెద్దపల్లిలో…