Wednesday, 4 November 2026

April 2013

జిల్లా వార్తలు

సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ అధికారులను నిర్భందించిన రైతులు

చిన్నచింతకుంట, జనంసాక్షి: ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ రైతులు దమద్‌నాపూర్‌లో అధికారులను నిర్భందించారు. రైతుచైతన్య యాత్రకు వచ్చిన వ్యవసాయాధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎన్నిసార్లు విన్నవించినా ఇవ్వడం లేదని వారిని గ్రామపంచాయతీ భవనంలో నిర్భందించి…

జిల్లా వార్తలు

రేపు జరగనున్న తెరాస ఆవిర్భావ సభ ఏర్పాట్లకు అంతరాయం

నిజామాబాద్‌, జనంసాక్షి: ఆర్మూర్‌లో రేపు జరగనున్న తెరాస ఆవిర్భావ సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి ఈదురుగాలులతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కటౌట్లు కూలిపోయాయి. బ్యానర్లు ఎగిరిపోయాయి.

ఆదిలాబాద్

కొనసాగుతున్న రైల్వే ఎన్నికలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మధ్య రైల్వే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నేడు కూడా కొనసాగుతున్నాయి. రైల్వే కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

ఆదిలాబాద్

చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు బయలుదేరిన తెదేపా నేతలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: విశాఖలో శనివారం నిర్వహించనున్న చంద్రబాబు పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు సిర్పూర్‌ నియోజకవర్గంలోని తెదేపా నాయకులు కార్యకర్తలు ఈ రోజు ప్రత్యేక రైల్లో బయలుదేరారు. బయలుదేరిన వారిలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగం, జిల్లా ఉపాధ్యక్షుడు…

తెలంగాణ

హైటెక్‌సిటీ వద్ద లభ్యమైన అనుమానాస్పద సూట్‌కేసు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్‌ వద్ద ఈ ఉదయం ఓ అనుమానస్పద సూట్‌కేసును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.

తెలంగాణ

భద్రాచలం ఆలయంలో ముత్యాల తలంబ్రాలు విక్రయం

ఖమ్మం, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాములవారి ఆలయంలో ముత్యాల తలంబ్రాల విక్రయాన్ని అధికారులు చేపట్టారు. ఒక్క ముత్యం ఉన్న తలంబ్రాల ప్యాకెట్‌ ధర రూ. 5, రెండు ముత్యాలు ఉన్న తలంబ్రాల ప్యాకెట్‌ ధర రూ. 10గా…

తెలంగాణ

మెదక్‌ ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి

నారాయణ్‌ఖేడ్‌, మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే పసికందు మృతికి కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్‌ 50 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

తెలంగాణ

ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌, మణికొండలో మరోసారి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంచాయితీ అధికారులను, సిబ్బందిని స్థానికులు ఆడ్డుకొని ఆందోళనకు దిగారు. నిర్మాణాలు చేపట్టిన సమయంలో అధికారులు ఏంచేశారని ప్రశ్నించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు…

అంతర్జాతీయం

ఒకే వేదికపై కలుసుకున్న అమెరికా ప్రస్తుత, మాజీ అధ్యక్షులు

వాషింగ్టన్‌, జనంసాక్షి:అమెరికా ప్రస్తుత , మాజీ అధ్యక్షులు గురువారం ఒకే వేదికపై  కలుసుకున్నారు. డల్లాన్‌లోని సధరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీ జార్జి డబ్ల్యూ గ్రంథాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, మాజీ అథ్యక్షులు జార్జి బష్‌…