Wednesday, 4 November 2026

April 2013

అంతర్జాతీయం

బొమ్మకారు రిమోట్‌తో ‘బోస్టన్‌’ పేలుళ్లు

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో మారథాన్‌ పరుగు జరుగుతున్నప్పుడు నిందితులు ఒక బొమ్మకారు రిమోట్‌ సాయంతో బాంబులు పేల్చారని ,ఉగ్రవాద సంస్థ ‘ఆల్‌కాయిదా’ ఆన్‌లైన్‌ పత్రిక ద్వారా వారు ప్రెషర్‌కుక్కర్‌ బాంబు తయారీ విదానాన్ని తెలుసుకుని ఉంటారని మేరిలాండ్‌…

కరీంనగర్

సీఎం పర్యటన దృష్ట్యా తెరాస, సీపీఐ నాయకుల ముందస్తు అరెస్టు

సైదాపూర్‌, జనంసాక్షి: భీమదేవరపల్లి మండలంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా సైదాపూర్‌ మండలానికి చెందిన తెరాస , సీపీఐ ముఖ్య నాయకులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు తెలంగాణ వాదులు వెళ్లకుండా స్థానిక పోలీసులు…

జాతీయం

ఇటలీ నావికుల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

న్యూఢిల్లీ, జనంసాక్షి: జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికులపై ప్రత్యేక కోర్టులో నిరంతరం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటలీ నావికుల కేసులో ఎస్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

జాతీయం

బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీబీఐ

న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. బొగ్గు కుంభకోణంపై నివేదిక వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రికి తెలియజేసినట్లు సీబీఐ డైరెక్టర్‌ వెల్లడించారు.

తెలంగాణ

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఫొటో ఎక్స్‌పో

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనంసాక్షి: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫొటో ఎక్స్‌పో 2013 రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రామోజీరావు ఫొటో ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఆయా స్టాళ్లను సందర్శించారు.…

జాతీయం

13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ముంబయి, జనంసాక్షి: 13 ఏళ్ల బాలిక ముంబయిలో సామూహిక అత్యాచారానికి గురైంది. నగరంలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆమె స్నేహితురాలే సహకరించింది. తన స్నేహితురాలు నిన్న రాత్రి తన ఇంటికి ఆహ్వానించిందని, అనంతరం…

జాతీయం

లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రాంరంభం కాగానే బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై భాజపాతోపాటు ఇతర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12…

తెలంగాణ

సీఎంతో భేటీఅయిన ఉపముఖ్యమంత్రి,మంత్రులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డీకే అరుణ, రఘువీరారెడ్డి, గీతారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

కాంగ్రెస్‌ రాజ్యాంగబద్ధ సంస్ధలను బలహీనం చేస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనం చేస్తోందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. జేపీసీ నుంచి విపక్ష సభ్యలను తొలగించాలనటం ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తుందని అన్నారు. భారత్‌లోకి ఛైనా చొరబాటు…

జిల్లా వార్తలు

ఈదురు గాలుల బీభత్సవం

చిన్నచింతకుంట, జనంసాక్షి: నిన్నరాత్రి వీచిన ఈదురు గాలులకు మండలంలో అపార నష్టం ఏర్పడింది. ముచ్చింతలలో 15 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నచింతకుంట, వడ్డేమాన్‌, దమద్‌నాపూర్‌ గ్రామాల్లో మామిడితోటలకు అపార నష్టం ఏర్పడింది. ఆయా…