Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

పాముకాటుతో మృతిచెందిన మహిళ

పరిగి, జనంసాక్షి: మండలంలోని రంగంపల్లి గ్రామంలో ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మంగమ్మ(32) అనే మహిళ ఆరుబయట నిద్రిస్తుండగా పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

తెలంగాణ

లభ్యమైన ఇంటర్‌ విద్యార్థి ఆచూకీ

నిజామాబాద్‌: కామారెడ్డి పట్టణానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కీర్తన (17) ఆచూకీ ముంబయిలో లభ్యమైనట్లు సమాచారం. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ముంబయికి బయలుదేరి వెళ్లారు. పట్టణంలో విద్యానగర్‌ కాలనీకి చెందిన కీర్తన హైదరాబాద్‌ నిజాంపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో…

కరీంనగర్

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల నిలిచిన విద్యుదుత్పత్తి

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తి పునరుద్ధరించేందుకు అధికారులు మరమ్మతుత్త చర్యలు చేపట్టారు.

సీమాంధ్ర

నేడు శ్రీకాకుళంలో వంశధార ట్రైబ్యునల్‌ పర్యటించనున్న కమిటీ

శ్రీకాకుళం: ఒడిశాతో రాష్ట్రానికి గల జల వివాదాలను పరిష్కరించేందుకు వంశధార ట్రైబ్యునల్‌ అత్యున్నత స్థాయి కమిటీ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. భామిని మండలం నేరడి బ్యారేజి ప్రతిపాదిత ప్రాంతంతోపాటు కాట్రగడ బి వద్ద సైడ్‌ వియ్యర్‌, హిర…

కరీంనగర్

కొంగగట్టులో దీక్షపరుల మధ్య తోపులాట

కరీంనగర్‌, జనంసాక్షి: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈ ఉదయం కల్యాణకట్ట వద్ద దీక్షాపరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో బారికేడ్లు కూలిపోయాయి. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆలయంలో భక్తులకు తగ్గట్లు సరైన…

తెలంగాణ

ప్రారంభమైన జలమండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: జల మండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. జంటనగరాల్లో తెరాస నుంచి ఎమ్మెల్యే హరీశ్‌రావు, తెదేపా నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి , కాంగ్రెస్‌ నుంచి మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు…

తెలంగాణ

ఇంటర్‌ విద్యార్థి మనస్థాపంతో మూడు రోజులుగా ఆచుకిలేకపోయింది

ఎల్లారెడ్డిపేట: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలో తప్పానని మనస్థాపంతో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటకు చెందిన మంగళహారతుల రాకేశ్‌ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇంటర్‌ ఫలితాలు చూసుకోవడానికి బయటకు వెళ్లిన…

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్ట పోయింది. నిప్టీ 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

తెలంగాణ

రెండో ఆటోలు ఢీకొన్ని చిన్నారి మృతి

ఖమ్మం: చర్ల మండలం ఆర్‌. కొత్త గూడెంలో ఈ ఉదయం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

కాంగ్రెస్‌ కార్యకర్తపై బాంబులతో దాడి

కడప : పెద్దముడియం మండలం సుద్దపల్లికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డిపై ప్రత్యేర్థులు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.