Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న చీఫ్‌ వివ్‌ గండ్ర

శాయంపేట: వరంగల్‌ జిల్లా శాయంపేట మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. దుంపల రంగారెడ్డి అనే రైతుకు చెందిన అరటి తోట, కొత్త ఇంద్రా రెడ్డికి…

తెలంగాణ

400 మందికి కుచ్చుటోపీ

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేటలో 400 మందికి కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. హెచ్‌ఐఎం హెచ్‌ఐఎం అనే సంస్థ నిర్వాహకులు, దాదాపు 400 మందినుంచి రూ. 80 లక్షలు వసూలు చేసి పరారు కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ

శ్రీరామచంద్రుని రథోత్సవం ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుని రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న జరగాల్నిన రథోత్సవం వాయిదా పడడంతో ఇవాళ నిర్వహిస్తున్నారు.

తెలంగాణ

ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన పలువురి నాయకులు

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఎంపీలు హరికృష్ణ సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, సినీ నటుడు బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని…

తెలంగాణ

బ్రాహ్మణయ్య మృతికి టీడీపీ అధ్యక్షుడు

విశాఖ: ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి బ్రాహ్మణయ్య ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు.

తెలంగాణ

గూడూరు వేళ్లనున్న బయ్యారం బృందం

వరంగల్‌ : బయ్యారం గనుల పరిశీలనకు తెరాస నేతలు వరంగల్‌ నుంచి ఈ ఉదయం బయలుదేరివెళ్లారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం గూడూరు, బయ్యారం గనులను పరిశీలించనుంది.

తెలంగాణ

తెరాసలో చేరనున్న రమణాచారి

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమణాచారి తెరాసలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత కేసిఆర్‌ సమక్షంలో ఆయన చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ

వొకేషనల్‌ కోర్సులో శ్రీకాకుళం ప్రథమ స్థానం

హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో వొకేషనల్‌ కోర్సులో 46,54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో 65శాతం ఉత్తీర్ణతతో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 30 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్‌ జిల్లా చివరి…

తెలంగాణ

ఇంటర్‌ 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు

హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలను మంత్రి పార్థసారథి విడుదల చేశారు. 54.6శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. గతేడాదితో పోలిస్తే 0.85శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. జనరల్‌ కేటగిరీలో 8,91,337 మంది పరీక్ష రాయగా…