Tuesday, 3 November 2026

May 2013

జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభంకాగానే 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దీంతో సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ సమావేశాన్ని…

తెలంగాణ

ఆందోళన చేపట్టిన కేసముద్రంలో రైతుల

వరంగల్‌ : మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ కేసముద్రంలో రైతులు అందోళన చేపట్టారు. అధికారులు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో అగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్‌ యార్డు కార్యదర్శిని నిర్బంధించి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభంకాగానే 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దీంతో సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ సమావేశాన్ని…

సీమాంధ్ర

ఏసీబీ వలలో చిక్కిన రికవరింగ్‌ అధికారి

అనంతపురం : ఏసీబీ వలకు రికవరింగ్‌ అధికారి చిక్కారు. అనంతపురంలో రికవరింగ్‌ అధికారి సుబ్బయ్య ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినటు చెప్పారు.

తెలంగాణ

చంద్రబాబును కలిసిన నారాయణ

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలిశారు. పాదయాత్ర జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన పొత్తుల విషయమై ప్రసుత్త భేటీలో చర్చించ లేదని వివరించారు.

అంతర్జాతీయం

హ్యూస్టన్‌ విమానాశ్రయం వద్ద వ్యక్తి ఆత్మహత్య

వాషింగ్టన్‌ : హ్యూస్టన్‌లోని బుష్‌ విమానాశ్రయంలో ఒక వ్యక్తి తనను తాను తుపాకీతో కాల్చుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. హ్యూస్టన్‌ పోలీసుశాఖ ప్రతినిధి కీన్‌ స్మిత్‌ మీడియాతో మాట్లాడుతూ బి టెర్మినల్‌ నుంచి వెలుపలికి వచ్చిన ఒక వ్యక్తి తన…

జాతీయం

రెపోరేటు 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

ముంబై, జనంసాక్షి: వార్సిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ సమీక్షించింది. ఇవాళ సమీక్ష నిర్వహించిన అనంతరం రెపోరేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేటును తగ్గిస్తూ, నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచింది. వృద్ధిరేటు 5.7 శాతం. 2013-14…

అంతర్జాతీయం

ఎఫ్‌బీఐ ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాలో మహిళ

వాషింగ్టన్‌ : 1973లో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపిన కేసులో 1977లో శిక్ష పడిన జోన్‌ చెస్సీమర్డ్‌ అలియాన్‌ అసాతా పకూర్‌ (65) అనే మహిళను ఎఫ్‌బీఐ తమ ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాలో పొందుపరిచింది. 34 సంవత్సరాల…

జాతీయం

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై, జనంసాక్షి: మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే ఇవాళ సెన్సెక్స్‌ 125 పాయింట్లు నష్టపోయి 19,600 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 5,960 పాయింట్లకు సమీపంలో ట్రేడ్‌ అవుతుంది.

తెలంగాణ

ఈ నెల 15 తర్వాత 5 జిల్లాల్లో నగదు బదిలీ

హైదరాబాద్‌ : సచివాలయంలో నగదు బదిలీ పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష ముగిసింది. ఈ నెల 15 తర్వాత మొదటి విడతగా ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు ఆర్థిక ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ వెల్లడించారు.…